రాష్ట్రంలో సమ్మె చేస్తున్న జూనియర్ వైద్యులకు వైద్యారోగ్యశాఖ నుంచి పిలుపొచ్చింది. జూనియర్ వైద్యుల సంఘాన్ని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ... చర్చలకు ఆహ్వానించారు. అందుకు సుముఖత వ్యక్తం చేసిన జూడాలు... బీఆర్‌కే భవన్‌లో రిజ్వీని కలవనున్నారు. జూడాల తరఫున ఐదుగురు సభ్యులు చర్చల్లో పాల్గొననున్నారు.
Juda's Strike: జూడాలకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి నుంచి పిలుపు - జూనియర్ వైద్యుల సమ్మె
తమ డిమాండ్లు నెరవేరటమే లక్ష్యంగా జూడాలు చేస్తున్న సమ్మె రెండు రోజుకు చేరింది. ఈరోజు ఏకంగా అత్యవసర సేవలకు కూడా ఆపేసి జూడాలు నిరసనలో పాల్గొన్నారు. ఈ క్రమంలో... వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ నుంచి చర్చల కోసం జూడాలకు పిలుపొచ్చింది.
Call for telangana Judas from the Health Secretary rigvi
రిజ్వీతో చర్చల తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని జూడాలుతెలిపారు. తమడిమాండ్లు నెరవేరవేరటమే లక్ష్యంగా జూడాలు నిన్నటి నుంచి సమ్మె చేస్తున్నారు. నిన్న అత్యవసర సేవలు మినహా విధులు బహిష్కరించిన జూడాలు... నేడు ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపేశారు.