హైదరాబాద్ ప్రగతిభవన్ వద్ద మంచిర్యాలకు చెందిన కేబుల్ ఆపరేటర్ రవీంద్ర ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రవీంద్రను అడ్డుకుని పంజాగుట్ట పీఎస్కు తరలించారు. బాధితుడిని విచారించగా.. తన కేబుల్ నెట్వర్క్ను రౌడీషీటర్ ఆక్రమించాడని తెలిపాడు. పోలీసులు, ప్రజా ప్రతినిధులు, చివరకు ఎమ్మెల్యేకు తన సమస్య చెప్పినా.. పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రగతిభవన్ వద్ద కేబుల్ ఆపరేటర్ ఆత్మహత్యాయత్నం - ప్రగతి భవన్ వద్ద కేబుల్ ఆపరేటర్ ఆత్మహత్యాత్నం
తన కేబుల్ నెట్వర్క్ను రౌడీషీటర్ ఆక్రమించాడని ఓ వ్యక్తి హైదరాబాద్ ప్రగతి భవన్ వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్ సీసాతో వచ్చి బలవన్మరణానికి యత్నించిన అతణ్ని పంజాగుట్ట పోలీసులు అడ్డుకున్నారు.
ప్రగతిభవన్ వద్ద కేబుల్ ఆపరేటర్ ఆత్మహత్యాయత్నం
ఎన్నో ఏళ్లుగా కేబుల్నెట్వర్క్పై ఆధారపడి జీవిస్తున్న తనకు ఇప్పుడు ఆధారం లేకుండా పోయిందని వాపోయాడు. కుటుంబాన్ని పోషించేందుకున్న ఒక్కగానొక్క ఆధారం చేజారిపోయిందని ఆవేదన చెందాడు.
తన సమస్య పరిష్కారం కాకపోవడం వల్లే చనిపోదామని ఇక్కడకు వచ్చానని తెలిపాడు.
- ఇదీ చూడండి : 'కారు'లో ముసలం... పాలేరులో 'కమిటీ'ల పంచాయితీ!
TAGGED:
హైదరాబాద్ ప్రగతి భవన్