ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22 మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. అదే రోజు నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గానికే తిరిగి మంత్రి వర్గంలో అవకాశం దక్కనుంది.
శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మత్స్యకార కుటుంబానికి చెందిన శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రివర్గంలో చోటు దక్కనుందని సమాచారం. మంత్రివర్గ సభ్యుల పేర్లను మంగళవారం అధికారికంగా ఏపీ ప్రభుత్వం వెల్లడించనుంది.