వర్షాకాల సమావేశాలను దృష్టిలో పెట్టుకొని... తెలంగాణ మంత్రివర్గం సమావేశం సాయంత్రం ఏడున్నరకు... ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా సహా... శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన ఇతర బిల్లులు, శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా... చర్చించే అవకాశముంది. ఇప్పటికే రెవెన్యూ చట్టం ముసాయిదాపై కసరత్తు పూర్తికాగా... ఆహార శుద్ధి విధానం, లాజిస్టిక్స్ విధానం ముసాయిదాలు సిద్ధమయ్యాయి. వీటన్నింటికీ... మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.
నేడు ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం - కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం
ఇవాళ సాయంత్రం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన... రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. శాసనసభ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలు, సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, నగరపాలక, ఎమ్మెల్సీ ఎన్నికలు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై కీలక చర్చ జరగనుంది.
![నేడు ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం cabinate meeting headed by cm kcr today evening 7.30pm](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8705965-thumbnail-3x2-cm.jpg)
రాబోయే శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మండలిలో గవర్నర్ కోటాలో భర్తీచేసే మూడు స్థానాలపైనా చర్చిస్తారని తెలుస్తోంది. మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కర్నె ప్రభాకర్‌కు ఎమ్మెల్సీలుగాా... మరోసారి అవకాశం ఇస్తారని సమాచారం. మూడో స్థానానికి సీఎం కేసీఆర్ ప్రత్యేకాధికారి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్, మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
ఇదీ చూడండి:అంతా సిద్ధం: నేటి నుంచి శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు