తెలంగాణ

telangana

ETV Bharat / city

కోర్టు దిక్కరణ కేసులో తహసీల్దార్​కు జైలు శిక్ష..

Tehsildar Jailed for Contempt of Court : ఏపీ కర్నూలు జిల్లా సి.బెళగల్ తహసీల్దార్​ జె.శివశంకర నాయక్..​ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు ఆ రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. దీంతో ఆయనకు ఆరు నెలల సాధారణ జైలుశిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించింది. ఈమేరకు తీర్పు వెల్లడించింది.

By

Published : Feb 20, 2022, 4:00 PM IST

Tehsildar Jailed for Contempt of Court , ap high court
కోర్టు దిక్కరణ కేసులో తహసీల్దార్​కు జైలు శిక్ష..

Tehsildar Jailed for Contempt of Court : కోర్టు ధిక్కరణ కేసులో కర్నూలు జిల్లా సి.బెళగల్ తహసీల్దార్​ జె.శివశంకర నాయక్​కు ఆరు నెలల జైలు శిక్ష... రూ.2వేల జరిమానా విధిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఓ రైతుకు చెందిన భూమి మ్యుటేషన్​కు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం అమలుచేయకపోవడంతో ఎమ్మార్వో.. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు ధ్రువీకరించిన కోర్టు.. ఈమేరకు తీర్పు వెల్లడించింది.

సి.బెళగల్ మండలం ముడుమాల గ్రామానికి చెందిన పింజరి కరీం సాబ్ ..అదే మండల పరిధిలోని కొత్తకోట గ్రామం సరిహద్దులో సర్వే నెం. 430/ 1లో 11 ఎకరాల 73 సెంట్ల తన సొంత భూమిలో వ్యవసాయం చేస్తూ..జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తన భూమికి సంబంధించి మ్యుటేషన్ నిమిత్తమై స్థానిక ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో గ్రామ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన ఆయన.. కరీం సాబ్ దరఖాస్తును తిరస్కరించారు. కరీం సాబ్ తనకు న్యాయం చేయాలని కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. సంబంధిత రైతు మ్యుటేషన్ కోసం చేసుకున్నదరఖాస్తును తిరస్కరిస్తూ.. సి.బెళగల్ ఎమ్మార్వో ఇచ్చిన ఆదేశాలు చెల్లవని,మ్యుటేషన్ చేయాలని ఆదేశించింది.

కాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం అమలుచేయకపోవడంతో ఎమ్మార్వో శివశంకర నాయక్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు ధ్రువీకరించిన కోర్టు.. ఆయనకు ఆరు నెలల సాధారణ జైలుశిక్షతో పాటు రూ.2,000లు జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు వారాలు జైలుశిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది.

ఇదీ చదవండి :శ్రీవారి ఆర్జిత సేవల ధరలు పెంచాలన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు

ABOUT THE AUTHOR

...view details