విలువలు మాత్రమే మెరుగైన సమాజాన్ని నిర్మించగలవంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రముఖ వ్యాపార వేత్త మోహన్ రెడ్డి అన్నారు. సరూర్నగర్ స్టేడియంలో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన సార్వజనికోత్సవ సభకు ఆయన అతిథిగా హాజరయ్యారు.
విలువలు పోగొట్టుకుంటే తిరిగిరావని... విలువలే మెరుగైన సమాజాన్ని నిర్మిస్తాయని మోహన్ రెడ్డి కార్యకర్తలకు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా నిలవాలని హితవు పలికారు. పిల్లలకు మహిళల పట్ల గౌరవభావం పెంపొందించే బాధ్యత తల్లిదండ్రులదేనన్న ఆయన... మహిళలపై జరుగుతున్న అరాచకాలు దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.