రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. పలుచోట్ల రహదారిపై నుంచి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట వద్ద లోలెవల్ వంతెనపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు సోమవారం లోలెవల్ వంతెనపై వరదలో చిక్కుకుపోయింది. వంతెన అంచు వరకు కొట్టుకుపోయింది.
bus washed away: వాగులో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు - గంభీరావుపేట
అందరూ చూస్తుండగానే వాగులో కొట్టుకుపోయింది ఆర్టీసీ బస్సు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంభీరావుపేట వద్ద లోలెవల్ వంతెనపై వరద ఉద్ధృతికి బస్సు కొట్టుకుపోయింది.
ఘటన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల కేకలతో స్థానిక రైతులు బస్సును గుర్తించి.. అందరిని రక్షించారు. మంగళవారం ఉదయం వరద ఉద్ధృతికి బస్సు వాగులో కొట్టుకుపోయింది. రైతులు వారి ఆర్తనాదాలు వినకపోయి ఉంటే... పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరిగేది. అలుగులు పారుతున్నప్పుడు.. ప్రయాణాలు చేయవద్దని పోలీసులు కోరుతున్నారు. నీటి ఉద్ధృతిని అంచనా వేయకపోవడం వల్ల వాహనాలు కొట్టుకుపోయి.. ప్రాణనష్టం జరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి:Harish rao: నీటమునిగిన వాటర్ ప్లాంట్... పరిశీలించిన మంత్రి హరీశ్