రాత్రి కర్ఫ్యూ దృష్ట్యా ఆర్టీసీ బస్సుల ప్రయాణ సమయం కుదింపు - తెలంగాణ వార్తలు

15:01 April 20
బస్సుల ప్రయాణ సమయాన్ని కుదిస్తూ ఆర్టీసీ నిర్ణయం
ప్రభుత్వం రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల సమయ పాలనను కుదించింది. రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే బస్సులను నడుపుతామని ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి తెలిపారు. సిటీ బస్సులు రాత్రి 9 గంటలలోపు ఆయా డిపోలకు చేరుకుంటాయని వెల్లడించారు. అంతరజిల్లాలకు వెళ్లాల్సిన బస్సులు మాత్రం 9లోపు వెళ్తాయని ఆయన స్పష్టం చేశారు.
రాత్రి 9 తర్వాత బయలుదేరాల్సిన బస్సుల సమయాన్ని 9లోపు వెళ్లేలా ఆయా డిపో మేనేజర్లు సమన్వయం చేసుకుంటారన్నారు. ప్రయాణికులందరూ విధిగా మాస్కులు ధరించాలన్నారు. మాస్కులు ధరించిన వారినే బస్సుల్లో ప్రయాణానికి అనుమతిస్తామని ఆపరేషన్స్ ఈడీ యాదగిరి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ