తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​లో కొనసాగుతున్న బంద్.. పలువురి అరెస్ట్ - tsrtc employees strike 15th day latest

ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు హైదరాబాద్​లోని పలు డిపోల బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉప్పల్, మెహిదీపట్నం, జీడిమెట్ల, కూకట్​పల్లి ఆర్టీసీ డిపోల వద్ద నిరసనకు దిగిన ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.

భాగ్యనగరంలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

By

Published : Oct 19, 2019, 9:38 AM IST

భాగ్యనగరంలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఐకాస ఇచ్చిన బంద్​ పిలుపు మేరకు హైదరాబాద్​ జిల్లావ్యాప్తంగా బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది.

  • ఉప్పల్​ డిపోలో 126 బస్సులు డిపోలోనే ఉండిపోయాయి. తెల్లవారుజామున వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించక తప్పలేదు.
  • మెహిదీపట్నం డిపో వద్ద 20 మంది డ్రైవర్లు, కండక్టర్లు కలిసి డిపో నుంచి బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతలో పోలీసులు వచ్చి వారిని అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
  • ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రాష్ట్ర బంద్​కు పిలుపునివ్వగా జీడిమెట్ల బస్ డిపో వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించారు. డిపో వద్దకు చేరుకున్న ఆర్టీసీ కార్మికులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారికి సంఘీభావం తెలిపిన పలువురు రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారు.
  • కూకట్​పల్లి వద్ద ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. నిరసనలు చేసేందుకు వస్తున్న ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. డిపో వద్ద ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details