రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున మధ్యంతర సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గిందన్న సీఎం... కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కూడా కోత పడిందని చెప్పారు.
'రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది' - cm kcr review on budjet
కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున మధ్యంతర సమీక్ష నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏఏ శాఖలకు ఎన్ని నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంటుందో నిర్ణయించాలని అధికారులకు సూచించారు.
'రాష్ట్రానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది'
కేంద్ర జీడీపీ కూడా మైనస్ 24 శాతానికి పడిపోయిందని... ఆ ప్రభావం రాష్ట్రాలపై పడుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో వాస్తవంగా ఎన్ని నిధులు అందుబాటులో ఉంటాయో అంచనా వేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ఏయే శాఖలకు ఎన్ని నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంటుందో నిర్ణయించాలన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్‌పై సమీక్ష నిర్వహించి... ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.