తెలంగాణ

telangana

ETV Bharat / city

షర్మిల ఏపీలో పార్టీ పెడితే.. చేరే తొలి వ్యక్తి కొడాలి నాని: బుద్ధా వెంకన్న

Budha and Nagulmeera fired on Kodali: కొడాలి నాని కానీ మరెవ్వరైనా కానీ.. చంద్రబాబు గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని తెదేపా ఏపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న హెచ్చరించారు. చంద్రబాబు సీఎం అయ్యాకే కొడాలి నానికి తెలుగుదేశంలో స్థానం దక్కిందని బుద్దా వెంకన్న గుర్తుచేశారు. షర్మిల పార్టీ పెడితే.. అందులో చేరే మొదటి వ్యక్తి కొడాలి అని జోస్యం చెప్పారు.

Budha and Nagulmeera fired on Kodali
కొడాలి నానిపై బుద్ధా వెంకన్న విమర్శలు

By

Published : Jan 24, 2022, 8:44 PM IST

Budha and Nagulmeera fired on Kodali: షర్మిల ఆంధ్రప్రదేశ్​లో పార్టీ పెడితే, అందులో చేరి సీఎం జగన్​ని తిట్టే మొదటి వ్యక్తి కొడాలి నాని అని తెదేపా ఏపీ కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. ప్రజలకు మేలు చేయటం చేతకాకే.. చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. గుడివాడలో బస్సులు, లారీల్లో కొడాలి నాని ఆయిల్ దొంగతనం చేస్తే, అప్పుడు పోలీసు అధికారిగా ఉన్న వర్ల రామయ్య చర్యలు తీసుకోలేదా అని ప్రశ్నించారు.

చంద్రబాబు సీఎం అయ్యాకే కొడాలి నానికి తెలుగుదేశంలో స్థానం దక్కిందని బుద్దా వెంకన్న గుర్తుచేశారు. హరికృష్ణ గుడివాడలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే, మధ్యలో వదిలేసి పారిపోయిన వ్యక్తి కొడాలి నాని అని విమర్శించారు. కొడాలి నాని కానీ.. మరెవ్వరైనా చంద్రబాబు గురించి మాట్లాడితే తాము పది రెట్లు మాట్లాడతామని హెచ్చరించారు. జోగి రమేష్‌లా మళ్లీ చంద్రబాబు ఇంటివైపు ఎవరైనా చూస్తే చావకొట్టి పంపుతామని వెంకన్న హెచ్చరించారు. డీజీపీకి కూడా కొడాలి నాని నిర్వహించిన క్యాసినోలో వాటాలు ఉన్నందుకే కేసు తొక్కిపెట్టారని మండిపడ్డారు. డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీగా డీజీపీ తీరుందని బుద్దా వెంకన్న ఆక్షేపించారు.

"జగన్​ ప్రవేశపెట్టే పథకాలతో పార్టీని సర్వనాశనం చేశారు. కొడాలి నాని మరింత నాశనం చేశారు. గతంలో కొడాలి నానికి తెదేపాలో స్థానం కల్పించిన చంద్రబాబునే ఈ రోజు విమర్శిస్తున్నారు. రేపు షర్మిల.. ఏపీలో పార్టీ పెడితే అందులో నాని చేరి.. జగన్​ను తిట్టరని నమ్మకమేంటి.?" -- బుద్ధా వెంకన్న, తెదేపా ఏపీ ప్రధాన కార్యదర్శి

"చంద్రబాబు మీద అవాకులు చెవాకులు పేలితే.. ఊరుకునేది లేదు. వైకాపాలో మొట్టమొదట ఓడిపోయేది కొడాలి నానినే. ప్రజలు మీ పదజాలాన్ని విని అసహ్యించుకుంటున్నారు. ఆయనకు మానసిక చికిత్స అవసరం." --- నాగుల్​ మీరా, తెదేపా అధికార ప్రతినిధి

కొడాలి నాని భాషపై రాష్ట్రమంతా ఉమ్మేస్తోందని తెదేపా అధికార ప్రతినిధి నాగుల్ మీరా విమర్శించారు. పిచ్చి ముదిరిన కొడాలి నానికి అత్యవసర మానసిక చికిత్స అవసరమని ఎద్దేవా చేశారు.

షర్మిల ఏపీలో పార్టీ పెడితే.. చేరే తొలి వ్యక్తి కొడాలి నాని: బుద్ధా వెంకన్న

ఇదీ చదవండి :Buddha Venkanna Arrest: తెదేపా నేత బుద్దా వెంకన్నను అరెస్ట్ చేసిన పోలీసులు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details