2020-21 ఆర్థిక ఏడాదిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు కలిపి 52,456 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. మిగతా గృహాల నిర్మాణం చివరి దశకు చేరుకుందని చెప్పారు. త్వరలోనే వీటిని లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.
కరోనా సంక్షోభం వల్ల ఆ హామీ వాయిదా పడింది: హరీశ్ రావు - telangana finance minister
పేదలకు గౌరవ ప్రదమైన నివాసాన్ని ఉచితంగా అందించాలనే ముఖ్యమంత్రి ఆశయానికి ప్రతిరూపమే డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. 2020-21 ఆర్థిక ఏడాదికి రెండు పడక గదుల ఇళ్ల కోసం రూ.11వేల కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి రూ.11వేల కోట్లు
గత బడ్జెట్లో సొంత స్థలం కలిగిన పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని హామీ ఇచ్చామన్న మంత్రి హరీశ్.. కరోనా ఆర్థిక సంక్షోభం వల్ల వాటి అమలు వాయిదా పడినట్లు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ కొద్దిగా పుంజుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర సర్కార్ దీని విధి విధానాలను త్వరలోనే విడుదల చేస్తుందని ప్రకటించారు.
- ఇదీ చూడండి :'కరోనా వల్లే రుణమాఫీ ఆలస్యమైంది'