తెలంగాణ

telangana

ETV Bharat / city

పబ్జీ‌ ఆటకు బానిసై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - ananthapuram news

పబ్జీ నిషేధించారనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏపీలోని అనంతపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పబ్జీ‌ ఆటకు బానిసై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
పబ్జీ‌ ఆటకు బానిసై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

By

Published : Sep 12, 2020, 2:19 PM IST

పబ్జి గేమ్​కు బానిసై బీటెక్ విద్యార్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీ అనంతపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలో రెవెన్యూ కాలనీలో ఉన్న నరసింహారెడ్డి, హిమజా రాణి కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి.

చెన్నైలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కిరణ్ కుమార్ రెడ్డి కళాశాలలో చదువుకుంటుండగా పబ్జీ గేమ్‌కు అలవాటుపడ్డాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్జీని నిషేధించింది. అప్పటి నుంచి కుంగుబాటుకు లోనైన కిరణ్... ఐదో తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుమారుడు కనిపించకపోయేసరికి ఆ తల్లిదండ్రులు కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వివరాలు నమోదు చేసుకొని... గాలింపు చేపట్టారు.

ఏదో పని మీద... స్టోర్​రూం తెరిచిన చూస్తే జరిగిన ఘోరం తెలిసింది. పబ్జీ నిషేధించారన్న ఆవేదనతో ఉన్న కిరణ్... ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తించారు తల్లిదండ్రులు. కుళ్లిన శవాన్ని చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈనెల ఏడో తేదీనే కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ధ్రువీకరించారు.

ఇదీ చదవండి:వివాహ వేడుకలో ఇరువర్గాల ఘర్షణ... పదకొండు మందిపై కేసు

ABOUT THE AUTHOR

...view details