పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రి కేటీఆర్ (KTR) వైట్ ఛాలెంజ్ (White Challenge), పరువు నష్టం దావాపై బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) స్పందించారు. చివరికి మన బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజీలు తన్నులాటలు, పరువు నష్టాల క్లైమాక్స్‌కు వచ్చాయని ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు, పోడు, అసైన్డ్ భూములు, కుంభకోణాలు, నిరుద్యోగ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఈ హైడ్రామా అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నువ్ ఎటు వైపు..? ఈ చెత్త ఛాలెంజీల వైపా..? లేక ఛిద్రమైన బతుకుల కోసం నిలబడ్డ బహుజనుల వైపా ..? అని ట్వీట్ చేశారు.
సంబంధిత కథనాలు :వైట్ ఛాలెంజ్ ఏంటి? రేవంత్‌పై కేటీఆర్ పరువునష్టం దావా ఎందుకేశారు?
పరువునష్టం దావా
డ్రగ్స్ పరీక్ష చేయించుకోవాలని మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇటీవల వైట్ ఛాలెంజ్ (White Challenge) విసిరారు. దీనిపై కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య మరోసారి ట్వీట్ వార్ కొనసాగింది. తనపై ఆరోపణలు చేస్తున్నవారిపై మండిపడ్డ కేటీఆర్.. వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దుష్ప్రచారంపై కోర్టులో పరువునష్టం దావా వేశారు. మాదకద్రవ్యాల కేసుతో ముడిపెడుతూ తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు చేయకుండా నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
సంబంధిత కథనాలు :బండి సంజయ్, ప్రవీణ్ కుమార్‌కు వైట్ ఛాలెంజ్ విసురుతున్నా: కొండా