తెలంగాణ

telangana

ETV Bharat / city

చెల్లికి న్యాయం కోసం.. ఎడ్లబండిపై దిల్లీకి అన్న - ఎడ్లబండిపై దిల్లీకి బయలుదేరిన ఆంధ్రవ్యక్తి

Brother Fight For Sister Life: ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలానికి చెందిన నాగదుర్గరావు.. తన చెల్లికి న్యాయం చేయాలంటూ ఎడ్లబండిపై దిల్లీ పయనమయ్యాడు. తన సోదరిపై అంతింటివారి వేధింపులను పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న నాగదుర్గారావు.. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తానని దిల్లీకి బయలుదేరాడు.

చెల్లికి న్యాయం కోసం.. ఎడ్లబండిపై దిల్లీకి అన్న
చెల్లికి న్యాయం కోసం.. ఎడ్లబండిపై దిల్లీకి అన్న

By

Published : May 25, 2022, 10:18 PM IST

Brother Fight for Sister Life: పెళ్లైయినప్పటి నుంచి తన చెల్లెలును బావ సరిగ్గా చూసుకోవడం లేదని.. తన చెల్లికి న్యాయం చేయాలని కోరుతూ ఏపీ నుంచి దిల్లీకి ఎడ్లబండి మీద ప్రయాణమయ్యాడో సోదరుడు. ప్రస్తుతం ఆ యాత్ర ఖమ్మం జిల్లా వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ముప్పాలకి చెందిన నాగదుర్గరావు.. అతని చెల్లెలు సత్యవతిని చందాపురానికి చెందిన నరేంద్రనాథ్‌కిచ్చి 2018లో వివాహం చేశారు. పెళ్లి జరిగినప్పటి నుంచి భర్త తనతో సరిగ్గా ఉండడం లేదంటూ పుట్టింటికి వచ్చేసింది సత్యవతి. భర్త కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని ఆమె పేర్కొంది. ఈ విషయమై నాగదుర్గరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో తన చెల్లికి న్యాయం చేయాలంటూ ఎడ్లబండిపై దిల్లీ ప్రయాణమయ్యాడు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తానని బాధితురాలి అన్న దుర్గప్రసాద్‌ స్పష్టం చేస్తున్నారు.

చెల్లికి న్యాయం కోసం.. ఎడ్లబండిపై దిల్లీకి అన్న

ABOUT THE AUTHOR

...view details