Brother Anil Kumar Meets EX MP Undavalli: క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఉండవల్లి నివాసంలో ఇరువురి మధ్య సుమారు గంటపాటు భేటీ జరిగింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి అరుణ్‌కుమార్‌తో చర్చించినట్లు అనిల్ తెలిపారు.
ఉండవల్లి గొప్ప రాజకీయ జ్ఞానం ఉన్న వ్యక్తి అని.. తనకు పాలిటిక్స్ పెద్దగా తెలియవని బ్రదర్ అనిల్ అన్నారు. అది తెలుసుకునేందుకే ఆయన్ను కలిసినట్లు పేర్కొన్నారు. రాజకీయం అంటే మంచి చేయడమని.. వాటి గురించి తెలుసుకునేందుకే ఉండవల్లిని కలిసినట్లు చెప్పారు.
'గొప్ప రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని కలవడం వల్ల మంచి జ్ఞానం వస్తుందని ఉండవల్లిని కలిశాను. ఆయన నాకు "విభజన కథ" అనే ఒక పుస్తకాన్ని కూడా బహూకరించారు.' -బ్రదర్ అనిల్