గత కొన్ని రోజులుగా ఏపీలోని చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో తిరుమలకొండపై నుంచి రహదారిపై అక్కడక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. 12వ కిలోమీటరు వద్ద పడ్డ కొండచరియలను తొలగించే సమయంలో కొంత సమయం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
తిరుమలలో విరిగిన కొండచరియలు.. ట్రాఫిక్‌కు అంతరాయం - tirumala news
ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుమలలో వర్షాలు కురుస్తున్నాయి. రెండవ కనుమ దారిలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. హరణీ సమీపంలో రహదారిపై పెద్ద బండరాయి పడింది. ఈ సమయంలో భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
తిరుమల రహదారిలో విరిగిన కొండచరియలు...ట్రాఫిక్‌కు అంతరాయం
క్రేన్, జేసీబీల సాయంతో ఎప్పటికప్పుడు రాళ్లను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బాలాజీ నగర్‌కు సమీపంలో రింగు రోడ్డు కుంగిపోయింది. గత నాలుగు రోజులుగా కొండపై ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. వానలతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు.