బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ సమావేశం మరోసారి వాయిదా పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా జలాల వివాదంపై వాదనలు వింటున్న ట్రైబ్యునల్ ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని గతంలో నిర్ణయించింది. అయితే, కరోనా నేపథ్యంలో నేరుగా వాదనలు వినిపించడం కష్టమని, వాయిదా వేయాలని రెండు తెలుగు రాష్ట్రాలు కోరినట్లు ట్రైబ్యునల్ పేర్కొంది.
బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ సమావేశం మళ్లీ వాయిదా - Brijesh Kumar Tribunal meeting
కరోనా వ్యాప్తి దృష్ట్యా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ సమావేశం మరోసారి వాయిదా పడింది. ఈనెల 27 నుంచి 29 వరకు జరగాల్సిన సమావేశాలు.. మార్చి 17 నుంచి 19 వరకు నిర్వహించాలని ట్రైబ్యునల్ నిర్ణయించింది.
బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ సమావేశం మళ్లీ వాయిదా
ఈ మేరకు మార్చి 17 నుంచి 19 వరకు సమావేశాన్ని నిర్వహించేలా నిర్ణయం తీసుకొన్న ట్రైబ్యునల్.. శుక్రవారం రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. ట్రైబ్యునల్‌లో ఏర్పడిన ఖాళీలు, కరోనా తదితర కారణాలతో 2019, సెప్టెంబరు నుంచి సమావేశాలు వాయిదా పడుతూనే ఉన్నాయి.