కొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. సినీ ఫక్కీలో పెళ్లి పందిరి నుంచి పెళ్లికూతురు పరారైన సంఘటన ఇది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని అనంతపురం జిల్లా ఎన్‌పీకుంట మండలం బలిజపల్లెకు చెందిన యువకుడు(26), తంబళ్లపల్లె మండలం కొటాల పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి పెద్దలు వివాహం నిశ్చయించారు. ఇరు కుటుంబాల వారు చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చి అమ్మచెరువు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో బుధవారం ఉదయం వివాహానికి ఏర్పాట్లు చేశారు.
Bride Escape: కొద్ది గంటల్లో వివాహం.. కానీ అంతలోనే ఆమె అదృశ్యం - కొద్ది గంటల్లో వివాహం..పెళ్లి పందిరి నుంచి వధువు పరారీ
కొద్ది గంటల్లో పెళ్లి... అందరూ పెళ్లి పనుల్లో తలమునకలై ఉన్నారు... ఏమైందో తెలీదు కానీ.. సినీ ఫక్కీలో పెళ్లి కూతురు రాత్రికి రాత్రే పరారైంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకోగా.. తమకు అవమానం జరిగిందని పెళ్లి కొడుకు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొద్ది గంటల్లో వివాహం.. కానీ అంతలోనే ఆమె అదృశ్యం
కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి వధూవరులకు నలుగుపెట్టారు. పెళ్లికుమార్తె రాత్రికి రాత్రే ఎవరికీ తెలియకుండా పరారైంది. తమకు అవమానం జరిగిందని పెళ్లి కొడుకు, వారి తరఫు బంధువులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో పెళ్లికూతురు మైనర్ అని తేలింది. ఒకటో పట్టణ ఎస్సై లోకేష్ దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:రెండు రోజుల కిందటే జన్మనిచ్చి.. 140 కిలోమీటర్లు దాటొచ్చి..