బంగాళాఖాతంలో యుద్ధ నౌక నుంచి బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా నౌకాదళం ప్రయోగించింది. సుదూరంలో ఉన్న నిర్దిష్ట లక్ష్యాన్ని బంగాళాఖాతంలో ఉన్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ రణ్ విజయ్ నుంచి ప్రయోగించారు. ఇది లక్ష్యాన్ని సరిగ్గా చేరుకుని మంచి ఫలితం చూపిందని భారత నౌకాదళం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
యుద్ధ నౌక నుంచి బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం - బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగం వార్తలు
భారత నౌకాదళం యుద్ధ నౌక నుంచి బ్రహ్మోస్ మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఐఎన్ఎస్ రణ్ విజయ్ నుంచి ప్రయోగించిన మిసైల్ సుదూరంలో ఉన్న నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకుందని నౌకాదళం ప్రకటించింది.
యుద్ధ నౌక నుంచి బ్రహ్మోస్ ప్రయోగం విజయవంతం
నౌకాదళం ఏ సమయంలోనైనా ఎలాంటి పోరాటానికి సిద్దమన్నది తాజా ప్రయోగం విజయవంతమే సంకేతమని నేవీ ప్రకటించింది.
ఇవీ చదవండి: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం