ఏడాదిలో ఒక్కసారి పూసే బ్రహ్మకమలం... ఒకటి పూస్తేనే ఎంతో అపురూపంగా చూస్తుటారు. కానీ ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా మెుండెపులంక గ్రామంలో మాత్రం ఒకే బ్రహ్మకమలం మెుక్కకు 24 పుష్పాలు వికసించటంతో అందరూ.. ఆశ్చర్యంగా తిలకించారు.
రాత్రి సమయంలో మాత్రమే వికసించే బ్రహ్మకమలం - Brahma lotus flowers blooms only at night time
ఆ పుష్పం ఒక్కటి పూస్తేనే ఎంతో గొప్పగా భావిస్తుంటారు శివుని భక్తులు. అటువంటిది ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 24 పువ్వులు పూసి భక్తులను పులకింపచేసిందా మెుక్క. ఇంతకా ఆ మెుక్క ఏంటంటే!
రాత్రి సమయంలో మాత్రమే వికసించే బ్రహ్మకమలం
రాత్రి సమయంలో మాత్రమే వికసించి... రెండు గంటల వ్యవధిలోనే వాడిపోవటం బ్రహ్మకమలం పుష్పాల ప్రత్యేక లక్షణం. మెుండెపులంక గ్రామానికి చెందిన ఆరుమిల్లి వీరభద్రరావు ఇంటి వద్ద రాత్రి పదిగంటల సమయంలో... 24 బ్రహ్మ కమలాలు వికసించాయి. విషయం తెలుసుకున్న స్థానికులు, శివ భక్తులు పుష్పాలు చూసేందుకు తరలివచ్చారు.
ఇదీ చదవండి :వాగులో గల్లంతైన సింధూరెడ్డి... తుంగభద్రలో దొరికిన మృతదేహం