ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు అదృశ్యమైన ఘటన దుండిగల్ పరిధి సూరారం కాలనీలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఆర్యన్ రాజ్... ఇంటి కింద ఆడుకోవడానికి వెళ్లినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎంతసేపైనా ఇంట్లోకి రాలేదని... చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదన్నారు.
ఆడుకోవడానికి బయటికెళ్లిన ఆ బాలుడు ఏమయ్యాడు? - boy missing
దుండిగల్ పరిధిలోని సూరారం కాలనీ చెందిన ఒకటో తరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు
ఆర్యన్ హిందీ, తెలుగు బాషల్లో మాట్లాడగలని చెప్పారు. ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు టీ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకున్నట్లు తెలిపారు. ఒకటో తరగతి చదువుతున్నట్లు బాలుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.