రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ సీఎంకు నివేదిక సమర్పించింది. రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బీసీజీ కమిటీ అధ్యయనం చేసింది. రాజధానిపై ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రెండు నివేదికలపై అధ్యయనానికి ఈనెల 6న ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తొలిసారి భేటీ కానుంది. 8న జరిగే మంత్రివర్గ సమావేశంలోనూ బీసీజీ నివేదికపై ప్రభుత్వం చర్చించే అవకాశముంది. వీటిపై అధ్యయనం తర్వాత 3 వారాల్లోగా హైపవర్ కమిటీ తన తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.
రాజధాని అంశంపై ఏపీ సీఎం జగన్‌కు బీసీజీ నివేదిక అందజేత - BOSTON PRESENTED REPORT TO CM JAGAN
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రతినిధులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తమ నివేదిక సమర్పించారు. రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బీసీజీ అధ్యయనం చేసింది. ఈనెల 8న జరిగే కేబినెట్ సమావేశంలోనూ బీసీజీ నివేదికపై ప్రభుత్వం చర్చించనున్నట్లు సమాచారం.
'కేబినెట్ సమావేశంలో బీసీజీ నివేదికపై చర్చించే అవకాశం'