ఆంధ్రప్రదేశ్తో పోల్చితే తమ వద్ద పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువంటూ.. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల్లోని పెట్రోల్ బంకుల వద్ద పోస్టర్లు వెలుస్తున్నాయి. తమిళనాడులోని ఓ పెట్రోల్ బంకులో ఏపీ కంటే పెట్రోలు రూ. 4.73, డీజిల్ రూ. 8.20 తక్కువని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో బ్యానర్లు పెట్టారు. దీనికితోడు.. వంద లీటర్ల డీజిల్ కొన్నవారికి ఒక కేజీ బాస్మతి బియ్యం ఉచితమని ఉన్న ప్రకటన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తమ బంకులో ఇంధనం నింపుకొని డబ్బు ఆదా చేసుకోండంటూ ఆ ప్రకటనలో ఉంది.
Ap Petrol Prices: ఏపీ కంటే మావద్ద పెట్రోల్, డీజిల్ రేట్ల తక్కువ.. పోస్టర్లు వైరల్ - విజయవాడ వార్తలు
ఏపీలోని పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోవడంతో సరిహద్దు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల యజమానులు దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆంధ్రాలోకంటే తమ వద్ద ధరలు తక్కువని.. ఈ అవకాశాన్ని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని బోర్డులు, పేపర్లు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
other states on ap petrol prices
ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ఓ కర్ణాటక పెట్రోల్ బంకులో.. ఏపీకంటే డీజిల్ రూ. 12, పెట్రోల్ రూ. 10 తక్కువంటూ ఉన్న కరపత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదీచూడండి:Petrol Prices in ap: గుడ్న్యూస్.. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు!