తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉర్దూ భాష ఔన్నత్యానికి రాష్ట్ర సర్కార్ కృషి : మంత్రి కొప్పుల - telangana minority welfare minister koppula eshwar

భాగ్యనగర సమగ్ర చరిత్రపై ఉర్దూ అకాడమీ ముద్రించిన శౌకత్-ఇ-ఉస్మానియా పుస్తకాన్ని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. హైదరాబాద్​ నగర చరిత్రపై పుస్తకాన్ని రాసిన వారిని మంత్రి అభినందించారు.

Hyderabad history, book on Hyderabad history, shaukat-e-osmania
హైదరాబాద్​ చరిత్ర, శౌకత్-ఇ-ఉస్మానియా

By

Published : Apr 16, 2021, 12:16 PM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల భద్రత, సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించి ప్రభుత్వం.. దాన్ని ఔన్నత్యాన్ని కాపాడుతోందని తెలిపారు. కేసీఆర్​కు ఉర్దూపై మంచి పట్టు ఉందని చెప్పారు.

హైదరాబాద్ నగర చరిత్రపై పుస్తకం ఆవిష్కరణ

భాగ్యనగర సమగ్ర చరిత్రపై ఉర్దూ అకాడమీ ముద్రించిన శౌకత్-ఇ-ఉస్మానియా పుస్తకాన్ని మంత్రి కొప్పుల ఆవిష్కరించారు. 250 ఫొటోలతో కూడిన చరిత్రను పరిశోధకుడు ఎజాజ్ రచించారు. హైదరాబాద్​ చరిత్రపై వివరణాత్మక పుస్తకాన్ని రచించిన వారిని మంత్రి అభినందించారు. ఆకర్షణీయంగా, అర్థవంతంగా ఉన్న ఈ పుస్తకం విద్యార్థులు, చరిత్రకారులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్

ABOUT THE AUTHOR

...view details