ఏటా ఓ పండగలా జరిగే హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను... ఇవాళ గవర్నర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేటి నుంచి జనవరి 1 వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో 330 బుక్ స్టాళ్లు కొలువుదీరనున్నాయి. ఈసారి జరిగే 33వ జాతీయ పుస్తక ప్రదర్శనకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామంటున్న... హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరీ గౌరీశంకర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
నేటి నుంచి పుస్తకాల ప్రదర్శన షురూ... - పుస్తక ప్రదర్శన ప్రారంభం
తెలంగాణ కళాభారతిలో ఇవాళ పుస్తక ప్రదర్శన ప్రారంభం కానుంది. 300 స్టాళ్లలో వివిధ పుస్తకాలు విక్రయించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. వారాంతపు రోజుల్లో 12 గంటలకే తెరుస్తారు. బాలబాలికలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెద్దల నుంచి మాత్రం 10 రూపాయలు వసూలు చేయనున్నారు.
నేటి నుంచి పుస్తకాల ప్రదర్శన షురూ...