తెలంగాణ

telangana

ETV Bharat / city

KISHAN REDDY: 'ప్రముఖ పండుగల జాబితాలో బోనాలను చేర్చేందుకు కృషి చేస్తా' - telangana varthalu

దిల్లీలోని తెలంగాణ భవన్​లో నిర్వహించిన లాల్​ దర్వాజా బోనాలు ఉత్సవాల్లో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పాల్గొన్నారు. బోనాల ఉత్సవాలను కేంద్రం ప్రచురించే ప్రముఖ పండుగల జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

KISHAN REDDY:  'ప్రముఖ పండుగల జాబితాలో బోనాలను చేర్చేందుకు కృషి చేస్తా'
KISHAN REDDY: 'ప్రముఖ పండుగల జాబితాలో బోనాలను చేర్చేందుకు కృషి చేస్తా'

By

Published : Jul 14, 2021, 11:28 AM IST

తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ప్రచురించే ప్రముఖ పండుగల జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన లాల్‌ దర్వాజా బోనాల్లో కిషన్‌ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. పూజల అనంతరం ఆయనకు పండితులు ఆశీర్వచనం అందజేశారు. లాల్​దర్వాజా బోనాల సందర్బంగా తెలంగాణ భవన్​లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడింది.

కరోనా కష్టకాలం నుంచి ప్రజలను కాపాడాలని... అందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్ధించినట్టు మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. తెలంగాణ పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని దేవిని కోరుకున్నట్లు వెల్లడించారు.

బోనాల శుభాకాంక్షలు..

తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తరఫున బోనాలు శుభాకాంక్షలు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ప్రచురించే ప్రముఖ పండుగల జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.

-కిషన్​రెడ్డి, కేంద్ర మంత్రి

KISHAN REDDY: 'ప్రముఖ పండుగల జాబితాలో బోనాలను చేర్చేందుకు కృషి చేస్తా'

ఇదీ చదవండి:Ts Cabinet: రిజిస్ట్రేషన్ రుసుమును ఏడున్నర శాతానికి పెంచుతూ నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details