Bommala Koluvu in Anantapur: దసరా పండుగలో దుర్గాపూజతో పాటు మరో ముఖ్యమైన అంశం బొమ్మల కొలువు. ఇవి నేటి తరం పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలను తెలియచెబుతాయి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో విశ్రాంత బ్యాంకు ఉద్యోగి కుటుంబం 30 ఏళ్లుగా బొమ్మల కొలువును నిర్వహిస్తోంది. ఒక్కో ఏడాది ఓ ప్రత్యేకతతో విజ్ఞానం అందించేలా ఈ కొలువు ఉంటోంది. ఈ సారి పిల్లల కోసం అనేక అంశాలను బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు.
"గత ముప్పై సంవత్సరాలుగా దసరాకు బొమ్మల కొలువు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం తమిళనాడు సుబ్రమణ్యస్వామి ఆరు పుణ్యక్షేత్రాలను బొమ్మల కొలువులో ఏర్పాటు చేశాము. చిన్నారులు కోసమే ప్రత్యేకంగా ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేశాము. ఎందుకంటే వారు ఎక్కువగా టీవీలు చూస్తు గడుపుతుంటారు. అందువల్ల వారికి పురణాల గురించి సరిగా తెలియటం లేదు. చిన్న పిల్లలకు అర్థమయ్యే తీరులో బొమ్మల ద్వారా కథలు చెప్తుంటాము". - మల్లిక బొమ్మల కొలువు నిర్వహకురాలు