కొవిడ్ సమయంలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న తనకు రాజకీయవేత్తలు ఫోన్ చేసి అభినందించారని ప్రముఖ సినీనటుడు సోనూసూద్ తెలిపారు. రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించగా.. సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. నటుడిగా సంతృప్తిగా ఉన్నానని చెప్పారు.
ప్రజాసేవకు రాజకీయాలతో పనిలేదు: సోనూసూద్
ప్రజాసేవ చేయడానికి రాజకీయాలతో పనిలేదని ప్రముఖ సినీనటుడు సోనూసూద్ స్పష్టం చేశారు. లాక్డౌన్ నుంచి నిరంతరంగా ప్రజలకు దగ్గరగా ఉంటున్నానని తెలిపారు. హైదరాబాద్ ఎల్బీనగర్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ప్రారంభించారు.
ఎల్బీనగర్లో సోనూసూద్ సందడి
హైదరాబాద్ ఎల్బీనగర్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న సోనూ.. ప్రజాసేవ చేయడానికి రాజకీయాలతో పని లేదని స్పష్టం చేశారు. లాక్డౌన్ నుంచి నిరంతరం ప్రజలకు దగ్గరగానే ఉంటున్నానని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఎంతో మంది నిరుపేదలు వైద్యం కోసం తనను సంప్రదించేవారని, వారి ఆర్థిక కష్టాలు తెలుసుకుని తన స్నేహితుడు, అంకు ఆస్పత్రి వ్యవస్థాపకుడు ఉన్నం క్రిష్ణప్రసాద్ సాయం చేశాడని తెలిపారు. తను పనిచేస్తున్న దర్శకులు కూడా ఎంతో సహకరించారని గుర్తుచేసుకున్నారు.
- ఇదీ చూడండి :ఇండోర్ ఘటనపై సోనూ అసహనం