తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆరోగ్యం పంచుతున్న బోధి యోగా కేంద్రం - యోగా

‍     శరీరం, మనసుకి స్వాంతన చేకూరుస్తూ.... చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించే  జీవన విధానమే యోగా.  శతాబ్దాల చరిత్ర కలిగిన యోగా పట్ల నేటితరం యూత్​లో క్రేజ్​ పెరిగిపోతున్నది. భాగ్యనగరంలో కొలువుదీరిన బోధి యోగా కేంద్రం 'అంతర్జాతీయ యోగా గురువు' పేరుతో శిక్షణ ఇస్తోంది. సాధారణ యోగానే మరింత ఆసక్తికరంగా నేర్పిస్తూ అందరి మన్ననలు పొందుతోంది.

ఆరోగ్యం పంచుతున్న బోధి యోగా కేంద్రం

By

Published : Aug 20, 2019, 7:21 PM IST

ఆరోగ్యం పంచుతున్న బోధి యోగా కేంద్రం

పచ్చని మొక్కలు, ప్రశాంతమైన వాతావరణం మధ్య కనిపిస్తున్న ఈ యోగ కేంద్రం పేరు బోధి యోగ. నగరవాసులకు యోగా నేర్పించటంతోపాటు.... ప్రపంచానికి మరింత చేరువ చేయాలన్నదే ఈ కేంద్రం లక్ష్యం. ఇందులో సాధారణ యోగాతో పాటు.... ప్రీ నేటల్ యోగ, పవర్ యోగ, పెల్లాటిస్, యాక్రో యోగ, వైఐఎన్ యోగ, థెరపిట్యుక్ యోగా వంటివి సాధన చేయిస్తున్నారు.

పేదలకు ఉచితం

యోగాసనాలు వేసే వారికి సులభంగా ఉండేదుకు స్ట్రింగ్స్​ని వాడటం ఇక్కడి ప్రత్యేకత. అనారోగ్యం కారణంగా యోగా నేర్చుకోవాలనుకునే వారికోసం ముందుగా బోధి ఆయుర్వేద ఆస్పత్రి వైద్యుల సలహాతో తగిన ఆసనాలు వేయిస్తుంటారు. నిరుపేదలై, అర్హత కలిగిన వారికి ఉచితంగా అంతర్జాతీయ యోగా గురు శిక్షణ ఇస్తున్నారు. రెండు నుంచి మూడు నెలల పాటు ఇవ్వనున్న ఈ శిక్షణలో ప్రతిభ గలవారికి స్కాలర్​షిప్​లు కూడా ఇవ్వనున్నారు.

యోగాతో... ఆనందం

బోధి యోగా స్టూడియో ద్వారా అంతర్జాతీయ గురువులను తయారు చేసే పనిలో పడ్డారు యోగా గురు అశోక్ కుమార్. ఇక్కడ శిక్షణ పూర్తయ్యాక... ఆసక్తి ఉంటే సొంతంగా స్టూడియోలు పెట్టుకోవచ్చని... లేకపోతే... తమ వద్ద ఉద్యోగం చేయవచ్చునని తెలిపారు. ఈ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న ఎంతో మంది మహిళలు.... తమకు బోధి యోగా చక్కని జీవన విధానాన్ని అలవరిచిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పేరులోనే పవర్

'బోధి యోగా'.. పేరులోనే ఆసక్తికరంగా ఉన్న ఈ యోగా కేంద్రం ప్రపంచానికి యోగాను మరింత చేరువ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. వివిధ రకాల యోగాను నగరవాసులకు అందిస్తూ... ముఖ్యంగా గర్భిణులకు అవసరమైన ప్రీ నేటల్ యోగాలో శిక్షణనిస్తూ.... మహిళలను మరింత ఆకట్టుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details