Boat races in prakasam: సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో తెప్పల పోటీలు నిర్వహించారు. చీరాల, వేటపాలెం, బాపట్ల మండలాల్లోని 30 మత్స్యకార గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సముద్రంలో హోరాహోరీగా జరిగిన పడవల పోటీల్లో.. కోడూరివారిపాలానికి చెందిన నాగరాజు మొదటి బహుమతిగా రూ.10 వేలు గెలుపొందారు.
Boat races in prakasam: సంక్రాంతి వేళ.. హోరాహోరీగా పడవల పోటీలు - సంక్రాంతి సందర్భంగా ప్రకాశంలో పడవల పోటీలు
Boat races in prakasam: సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏపీలోని ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో తెప్పల పోటీలు నిర్వహించారు. సముద్రంలో హోరాహోరీగా జరిగిన పడవల పోటీలు వీక్షించేందుకు.. ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.
ప్రకాశం జిల్లాలో పడవల పోటీలు
సముద్రంలో పడవల పోటీలు తిలకించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ పోటీలు ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకారుల్లో పోటీతత్వం ఏర్పడుతుందని.. ఏపీ మత్స్యకార సంక్షేమ సమితి అధ్యక్షుడు పొలంగారి పోలయ్య అన్నారు.
ఇదీ చదవండి:Kanuma: కనుమ.. పాడిపంటలు, పశువులతో రైతన్న అనుబంధాన్ని ఆవిష్కరించే పండుగ