'కేసీఆర్ తీరు మారకుంటే.. 48 గంటల బంద్ నిర్వహిస్తాం' - bms protest at hyderabad collectorate
కేసీఆర్ తీరు మారకుంటే 48 గంటల బంద్ ప్రకటిస్తామని భారతీయ మజ్దూర్ సంఘ్ నేత మల్లేషం తెలిపారు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
ఆర్టీసీ సమ్మెకు బీఎంఎస్ మద్దతు
ఆర్టీసీ కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించడం సరికాదని భారతీయ మజ్దూర్ సంఘ్ నేత మల్లేషం అభిప్రాయపడ్డారు. ఆర్టీసీని ప్రైవెటీకరణ చేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన 8,590 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. కేసీఆర్ తన మొండి వైఖరిని మారకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ , ఉపాధ్యాయ , విద్యార్థి , ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని 48 గంటలు బంద్ ప్రకటిస్తామని హెచ్చరించారు.
- ఇదీ చూడండి : ఆర్టీసీ సమ్మెను ప్రజల్లోకి తీసుకెళ్లండి: లక్ష్మణ్