మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా పలువురు పోలీసు అధికారులతో పాటు స్థానికులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని అందించారు. మొత్తం 152 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
తలసేమియా రోగుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు - blood donation camp set up for thalassemia victims
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ పోలీసులు తలసేమియా రోగుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు స్థానికులు రక్తదానంలో పాల్గొనగా మొత్తం 152 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
![తలసేమియా రోగుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు blood donation camp for thalassemia victims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-placeholder.jpg)
తలసేమియా రోగుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు
సేకరించిన మొత్తం రక్తాన్ని అవసరమున్న తలసేమియా బాధితులకు అందజేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో మాదాపూర్ అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, కూకట్ పల్లి ఏసీపీ సురేంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.