ఆమె.. అంధురాలు.. కానీ సాయం చేయడంలో అందరి కంటే గొప్పదైన మనసు ఆమెది. తనకొచ్చే కొద్ది పాటి పింఛన్ సొమ్మునే విరాళంగా ఇచ్చేంత దయాగుణం కలది. కొవిడ్ బాధితులకు తన వంతు సాయం చేస్తున్న నటుడు సోనూసూద్ గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందింది. ఆపదలో ఉన్న వారి కష్టాలను తీర్చేందుకు స్థాపించిన సోనూసూద్ ఫౌండేషన్‌కు ఉడతాభక్తిగా సాయం చేయాలని నిర్ణయించుకుంది.
నా దృష్టిలో రిచెస్ట్ ఇండియన్ ఆమె: సోనూసూద్ - ap news
ఎదుటి వారి బాధను చూసేందుకు కంటి చూపే అవసరం లేదు. ఆ బాధ వెనక ఉండే ఆవేదన తెలిస్తే చాలు. దానికి తోడు ఓ మంచి మనసు ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. ఆ మనసు చెప్పే మాట విని సాయపడొచ్చు. అలా.. సొనూసూద్ ఫౌండేషన్‌కు సాయం చేసింది ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ అంధురాలు.
ఏపీలోని నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన యూట్యూబర్.. బొడ్డు నాగలక్ష్మి సోనూసూద్ ఫౌండేషన్‌కు రూ. 15 వేలు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ట్వీట్ తో ప్రపంచానికి తెలియజేశారు.. సోనూసూద్. తన దృష్టిలో నాగలక్ష్మి 'రిచెస్ట్ ఇండియన్'.. అని ప్రశంసించారు. ఇతరుల బాధను చూసేందుకు కంటిచూపు అవసరం లేదని.. ఆమె సహాయాన్ని మనసారా అభినందించారు. మీరే నిజమైన హీరో అంటూ.. ట్వీట్ చేశారు. నాగలక్ష్మి విరాళం ఇచ్చిన 15 వేల రూపాయలు.. ఆమెకు వచ్చిన ఐదు నెలల పెన్షన్ కావడం గొప్ప విషయం.
ఇదీ చదవండి:'ఇంట్లోనే ప్రార్థనలు జరుపుకోవాలి... మసీదులో నలుగురికే అనుమతి'