తెలంగాణ

telangana

ETV Bharat / city

సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగుల ధర్నా - తెలంగాణ వార్తలు

హైదరాబాద్ నానల్​నగర్​ వసతి గృహంలోని దివ్యాంగులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. హాస్టల్​లో పారిశుద్ధ్యం లోపించిదని వాపోయారు.

blind people protest at nanal nagar in hyderabad, demanding to solve their problems
సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగుల ధర్నా

By

Published : Feb 14, 2021, 8:20 PM IST

వసతి గృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ నానల్​నగర్​లోని దివ్యాంగులు ఆందోళనకు దిగారు. శుక్రవారం నుంచి దీక్ష చేస్తున్నామని.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హాస్టల్​లో పారిశుద్ధ్యం లోపించిదని, తాగునీటి డ్రమ్ములు శుభ్రం చేసి నెలలు గడిచాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

128 మంది ఇక్కడ వసతి పొందుతుంటే, ఏడుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారన్నారు. నిబంధనల ప్రకారం.. ప్రతి 10 మందికి ఒక సిబ్బంది ఉండాలన్నారు. 2016లో ఇచ్చిన ట్రంకు పెట్టెలు పాడయ్యాయని.. ఐప్యాడ్ అప్కో కార్డులు, బ్రెయిలీ షీట్స్ రెండేళ్లుగా ఇవ్వడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు నిరసన కొనసాగుతుందని విద్యార్థులు కాళీ, స్వామి, నిరంజన్, ఆనంద్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఐఎంఏ వైద్యుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details