నేర్చుకోవాలన్న సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని హైదరాబాద్‌కు చెందిన అంధ అమ్మాయిలు నిరూపిస్తున్నారు. ఖమర్ ఫాతిమా, నజిశ్ బేగం, జుహా ఫాతిమా పుట్టుకతోనే అంధులు. చాదర్‌ఘాట్ ఐడియల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ డిజబులిటీ (ఐఐసీడీ) పాఠశాలలో బ్రెయిలీ లిపి నేర్చుకుని అరబీలోని ఖురాన్‌ను చక్కగా పఠిస్తున్నారు.
ఆదర్శం... అంధ బాలికల ఖురాన్ పఠనం - hyderabad latest news
పుట్టుకతో వాళ్లు అంధులు. కానీ... నేర్చుకోవాలన్న తపన ముందు ఆ లోపం వారికి ఏమాత్రం అడ్డురాలేదు. బ్రెయిలీ లిపిని నేర్చుకుని... తమ పవిత్ర గ్రంధమైన ఖురాన్‌ను ఎలాంటి ఉచ్ఛారణ లోపం లేకుండా పఠిస్తూ... అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జనవరి 4 న అంధుల దినోత్సవం సందర్భంగా... హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు అంధ బాలికల ప్రతిభను పలువురు అభినందిస్తున్నారు.
![ఆదర్శం... అంధ బాలికల ఖురాన్ పఠనం blind girls reading quran in hyderabad chaderghat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10107791-882-10107791-1609692845458.jpg)
blind girls reading quran in hyderabad chaderghat
ఆదర్శం... అంధ బాలికల ఖురాన్ పఠనం
ప్రపంచమంతా చీకటి అయినా... దేవుడిచ్చిన దివ్యకాంతితో ముందుకు వెళుతున్నామని ఈ బాలికలు చెబుతున్నారు. బ్రెయిలీ లిపిలో ఖురాన్ చదవడం నేర్చుకుని... ఎటువంటి ఉచ్ఛారణ లోపాలు లేకుండా పఠిస్తూ... అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అంధులైనా ఖురాన్‌ను చక్కగా పఠిస్తున్న ఈ బాలికలను అందరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆరేళ్ల బాలికపై కీచకుల అత్యాచారయత్నం
Last Updated : Jan 3, 2021, 10:52 PM IST