తెలంగాణ

telangana

ETV Bharat / city

ట్విటర్ ట్రెండింగ్​లో #బ్లీచింగ్ పౌడర్ - cm jagan on corona virus

పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్.. ఇప్పుడు డిజిటల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. రెండు రోజులుగా నెటిజన్లు ఈ రెండు పదాల గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు. కరోనా వైరస్​ నివారించేందుకు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ చాలంటూ ఏపీ సీఎం చేసిన వ్యాఖ్యలు.. ఆన్​లైన్​లో అదరగొడుతున్నాయి. బ్లీచింగ్ పౌడర్ హాష్ ట్యాగ్ ఆదివారం ట్విటర్ ట్రెండింగ్​.. టాప్​లో నిలిచింది.

bleaching-powder-hashtag-trending-in-twitter
bleaching-powder-hashtag-trending-in-twitter

By

Published : Mar 16, 2020, 9:34 PM IST

ఏపీ సీఎం జగన్మోహన్​రెడ్డి రెండు రోజులుగా ట్విటర్, ఫేస్​బుక్ ట్రెండింగ్​లో నిలిచారు. కరోనా వైరస్​ను ఎలా నివారించాలో.. ఆయన చెప్పిన పద్ధతి.. ఆన్​లైన్​లో హల్​చల్ చేసింది. కరోనా వైరస్​ను పారాసిటమాల్ టాబ్లెట్, బ్లీచింగ్ పౌడర్​తో అరికట్టవచ్చంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఎక్కువ మంది స్పందించారు. బ్లీచింగ్ ​పౌడర్ హాష్​ ట్యాగ్​ ఆదివారం ట్విటర్ ట్రెండింగ్​లో టాప్​లో నిలవగా.. ఇప్పటికీ ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తూనే ఉంది. నెటిజన్లు దీనిపై భిన్న కోణాల్లో స్పందిస్తున్నారు.

అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా కూడా కరోనాను అరికట్టడంలో తంటాలు పడుతుంటే.. ఏపీ సీఎం సులువైన పరిష్కారం చెప్పేశారంటూ.. కొంతమంది ఎద్దేవా చేశారు. చాలా మంది ఫన్నీ మీమ్స్ తయారు చేసి ఆన్​లైన్​లో షేర్ చేస్తున్నారు. జగన్​ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని... వివిధ దేశాల్లో కరోనాకు పారాసిటమాల్​నే వాడుతున్నారంటూ.. కొందరు మద్దుతుగా నిలిచారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని చెప్పిందని గుర్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:ఎన్నికల మీద ఉన్న ధ్యాస కరోనా నియంత్రణ మీద లేదా?: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details