తెలంగాణ

telangana

ETV Bharat / city

'వరద ఆర్థిక సాయంపై శ్వేత పత్రం విడుదల చేయండి' - hyderabad latest news

భారతీయ జనతా యువ మోర్చా నాయకులు హైదరాబాద్​ అబిడ్స్​లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన వరద ఆర్థిక సాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. బాధితులందరికి న్యాయం జరిగే వరకు భాజపా తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

bjym leaders protested in hyderabad
bjym leaders protested in hyderabad

By

Published : Oct 31, 2020, 4:54 PM IST

రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన వరద ఆర్థిక సాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని భారతీయ జనతా యువ మోర్చా హైదరాబాద్ నగర అధ్యక్షుడు వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆర్థిక సాయం పేరుతో తెరాస ప్రభుత్వం ఓట్ల రాజకీయం చేస్తోందని ఆరోపించారు. నగరంలో నిలిపేసిన వరద సాయాన్ని... బాధితులు అందరికి అందే వరకు కొనసాగించాలంటూ అబిడ్స్​లోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

స్థానిక తెరాస నాయకులు తమకు అనుకూలంగా ఉండే వారికే రూ.10 వేల సాయాన్ని అందించారని... అసలైన బాధితులకు అందించలేదని ఆరోపించారు. బాధితులందరికి న్యాయం జరిగే వరకు భాజపా తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'రైతుల నడ్డి విరిచేలా కేంద్ర వ్యవసాయ చట్టాలు'

ABOUT THE AUTHOR

...view details