కరోనా విపత్కర సమయంలో ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్ క్లాసుల పేరుతో దోపిడికి పాల్పడుతున్నాయని జీజెవైఎం నేతలు ఆరోపించారు. కూకట్‌పల్లిలోని ది క్రిక్ పాఠశాల వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో ఇష్టానుసారం ఫీజుల వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోండి: బీజేవైఎం - బీజేవైఎం ధర్నా
కరోనా వ్యాప్తితో ప్రజలు ఉపాధి కోల్పొయిన తరుణంలో ప్రైవేటు పాఠశాలలు మాత్రం ఫీజుల పేరుతో తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నాయంటూ బీజేవైఎం ఆరోపించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కూకట్‌పల్లిలో నిరసన చేపట్టింది.
![ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోండి: బీజేవైఎం](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News
జీవో నెెెెెెంబర్ 46ను అమలు చేసి తల్లిదండ్రులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎమ్ రాష్ట్ర కార్యదర్శి విజ్జిత్ వర్మతో పాటు తదితరులు ఉన్నారు.