BJP High Command Focus on Telangana: రాష్ట్రంలో పాగా వేసేందుకు భాజపా జాతీయ నాయకత్వం మరింత దృష్టి సారించింది. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరింత సమయం కేటాయించనున్నారు. ఇక ప్రతి నెల తెలంగాణకు రానున్న షా రెండు రోజులు పాటు ఇక్కడే ఉండనున్నారు. రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులును పంజాబ్‌కి జాతీయ నాయకత్వం బదిలీ చేసింది.
రాష్ట్రంలో పాగా వేసేందుకు భాజపా జాతీయ నాయకత్వం కసరత్తు - తెలంగాణలో పాగా వేసేందుకు భాజపా కసరత్తు మొదలు
BJP High Command Focus on Telangana: తెలంగాణలో పాగా వేసేందుకు భాజపా జాతీయ నాయకత్వం కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కేంద్రహోంశాఖ మంత్రి ఇక ప్రతి నెలలో రెండ్రోజులు వచ్చి ఇక్కడే ఉండనున్నారు. సునీల్ బన్సల్ లేదా ఆ స్థాయి నేతను రాష్ట్రానికి సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా పంపించే అవకాశం ఉందని భాజపా వర్గాలు తెలిపాయి.
BJP
ఆయన స్థానంలో తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా సీనియర్ అరెస్సెస్ ప్రచారక్‌ని కమల దళపతి నడ్డా నియమించనున్నారు. ఉత్తర ప్రదేశ్ సంఘటన కార్యదర్శిగా ఉన్న సునీల్ బన్సల్ లేదా ఆ స్థాయి నేతను రాష్ట్రానికి సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా పంపించే అవకాశం ఉందని భాజపా వర్గాలు తెలిపాయి. సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రానికి చెందిన అర్ఎస్ఎస్ ప్రచారక్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: