అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముట్టడికి యత్నించింది. ముట్టడికి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం వల్ల రోడ్డుపై బైఠాయించారు.
ఇంటర్ బోర్డు ముట్టడికి భాజపా యువ మోర్చా యత్నం - bjp yuva morcha protest in telangana against corporate colleges fee
కార్పొరేట్ కళాశాలల్లో అధిక ఫీజుల వసూల్ను అరికట్టాలని డిమాండ్ చేస్తూ భాజపా యువ మోర్చా నాయకులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నాంపల్లి ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించిన బీజైవైఎం శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.
ఇంటర్ బోర్డు ముట్టడికి భాజపా యువ మోర్చా యత్నం
పోలీసులు, బీజేవైఎం కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలతో ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కార్పొరేట్ కళాశాలల్లో అధిక ఫీజులను అరికట్టాలని, తొలగించిన కార్పొరేట్ కళాశాలల అధ్యాపకులను విధుల్లోకి తీసుకునేలా ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు తీసుకోవాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించింది.
Last Updated : Mar 5, 2021, 1:09 PM IST