టికెట్ అమ్ముకున్నారని.. భాజపా కార్యాలయంలో కార్యకర్తల ఆందోళన - ghmc elections
15:06 November 22
టికెట్ అమ్ముకున్నారని.. భాజపా కార్యాలయంలో కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో గన్‌ఫౌండ్రీ డివిజన్‌కు చెందిన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సురేఖ ఓంప్రకాశ్‌కు టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. కార్యాలయంలోని కుర్చీలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను పోలీసులు కార్యాలయం నుంచి బయటకు పంపించారు.
గన్‌ఫౌండ్రీ భాజపా అభ్యర్థి ఓం ప్రకాశ్‌పై టికెట్ ఆశించి భంగపడ్డ శైలేందర్ యాదవ్ వర్గీయులు దాడికి యత్నించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి , లక్ష్మణ్‌లు కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెదేపా నుంచి వచ్చిన ఓంప్రకాశ్‌కు టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. స్థానిక భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ కక్షగట్టారని గన్‌ఫౌండ్రి డివిజన్ భాజపా అధ్యక్షుడు శైలేందర్ యాదవ్ ఆరోపించారు.