నేడు భారీ ర్యాలీతో భాజపా నామినేషన్ తెరాస అప్రజాస్వామిక విధానాలపై రాష్ట్ర గవర్నర్, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని భాజపా కోర్ కమిటీ నిర్ణయించింది. ఉపఎన్నికల్లో గెలిచేందుకు సర్పంచుల సంఘం అధ్యక్షుడిని అరెస్టు చేశారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు.
హుజూర్నగర్ బరిలో భాజపా అభ్యర్థిగా కోటా రామారావు
హుజూర్నగర్ ఉప ఎన్నికల అభ్యర్థిగా కోటా రామారావును కేంద్రం ఖరారు చేసిందని కమిటీ తెలిపింది.ఉప ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్‌గా కిషన్ రెడ్డిని నియమించగా, సభ్యులుగా ఎంపీలు ఉంటారు. ఇవాళ ఉదయం 11గంటలకు భారీ ర్యాలీ నిర్వహించి అభ్యర్థి నామినేషన్ వేయడానికి భాజపా సన్నాహాలు చేసింది.
భూమన్న అరెస్ట్‌పై ఆగ్రహం
ఉపఎన్నికలో ఉన్నతాధికారుల తీరుపై భాజపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీలు ఎన్నికల సమయంలో ఏకపక్షంగా ప్రభుత్వం కోసం పని చేస్తున్నారని పార్టీ కమిటీ దుయ్యబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం బేషరుతుగా సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూమన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, వివేక్ వెంకట్ స్వామితో పాటు కోర్ కమిటీ సభ్యులు హుజూర్ నగర్ ఎన్నికల వ్యూహంపై చర్చించారు. మండలాల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: నామినేషన్లకు నేడే చివరి తేదీ