Telangana Liberation Day: భాజపా రాష్ట్ర నాయకత్వం సెప్టెంబర్ 17ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ విమోచనదినం అని కాకుండా తెలంగాణ విముక్తి దినోత్సవమని పిలవాలని నిర్ణయించింది. ఈ సెప్టెంబర్ 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17వరకు తెలంగాణ విముక్తి వేడుకలు నిర్వహించాలని భావిస్తోంది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలపి 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఏడాది పాటు ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
తెలంగాణ వి(ముక్తి)మోచనదినంపై భాజపా ఫోకస్.. ఏడాది పాటు ఉత్సవాలు..
Telangana Liberation Day: రాష్ట్రంలో పట్టు సాధించేందుకు అన్ని రకాల అవకాశాలను భాజపా అందిపుచ్చుకుంటోంది. అందులో భాగంగానే.. సెప్టెంబర్ 17పై దృష్టి సారించింది. తెలంగాణ విముక్తి వేడుకలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది.
BJP Want to celebrate Telangana Liberation Day celebrations for a year
వచ్చే ఏడాది సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని కమలనాథులు నిర్ణయించారు. అజాదీ కా అమృత్ మహోత్సవం తరహాలో తెలంగాణ విముక్తి ఉత్సవాలు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఆ సమయంలో నెలకొన్న సామాజిక, రాజకీయ, చారిత్రక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని వాటికి.. జాతీయ నాయకులను ఆహ్వానించాలని యోచిస్తోంది.
ఇవీ చూడండి: