దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని.. అప్పుడే వల్లభ్ భాయ్ పటేల్‌కు ఘనమైన నివాళి అర్పించినట్లు అవుతుందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ కేపీహెచ్బీలోలో ఏర్పాటుచేసిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. సర్దార్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జెండా ఊపి రన్ ఫర్ యూనిటీ ర్యాలీ ప్రారంభించారు.
BANDI SANJAY: దేశం కోసం ధర్మం కోసం పనిచేయడమే సర్దార్కు ఘన నివాళి
సీఎం కేసీఆర్‌కు జాతీయ నేతల కంటే నిజాంపైనే ప్రేమ ఎక్కువని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నాడు సర్దార్ జయంతి గుర్తించని కాంగ్రెస్ నేడు ఆయన విగ్రహానికి నివాళులు అర్పిస్తోందని సంజయ్ అన్నారు.
పటేల్ జయంతిని గుర్తించని కాంగ్రెస్.. నేడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు జాతీయ నేతల కంటే నిజాంపైనే ప్రేమ ఎక్కువని సంజయ్ విమర్శించారు. తెలంగాణలో పాకిస్తాన్ జెండా ఎగరవేస్తే ఉరికించి కొడతామని.. కరీంనగర్లో జరిగిన సంఘటనే దీనికి నిదర్శనమని హెచ్చరించారు. యువకుల్లో దేశభక్తి నింపడానికి రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహిస్తున్నారని.. నవభారత్ నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని కోరారు.
ఇదీచూడండి:'పటేల్ స్ఫూర్తితోనే భారత్ అన్ని సవాళ్లు ఎదుర్కోగలుగుతోంది'