తెలంగాణ

telangana

ETV Bharat / city

'సూర్య చంద్రులున్నంత కాలం తెలంగాణ ప్రజలు సర్దార్ పటేల్​ను మరవలేరు' - sardar vallabhbhai patel

జాతీయవాదుల స్ఫూర్తితో అఖండ భారత నిర్మాణానికి, జాతి సమగ్రతకు పార్టీ శ్రేణులు ముందుకు సాగనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. సర్దార్‌ వల్లభ్​భాయ్​ పటేల్​ జయంతి పురస్కరించుకుని హైదరాబాద్‌ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పలువురు నాయకులు పటేల్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

BJP state president bandi sanjay
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌

By

Published : Oct 31, 2020, 12:12 PM IST

తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువు పీల్చుకోవడానికి నాడు సర్దార్‌ వల్లభ్​భాయ్​ పటేల్​ చేపట్టిన పోలీస్‌ యాక్షన్‌ ప్రధాన కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, పలువురు నేతలతో కలిసి వల్లభ్​భాయ్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ చేసిన వాగ్దానాలు విస్మరించారని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పటేల్​కు నివాళులర్పించి తమ నిజాయతీ చాటుకోవాలన్నారు. సూర్య చంద్రులున్నంత కాలం తెలంగాణ ప్రజలు సర్దార్‌ వల్లభ్​భాయ్‌ పటేల్‌ను మరువలేరని తెలిపారు.

పటేల్​కు నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. మజ్లిస్‌ పార్టీ నేతల కనుసన్నల్లో తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతోందని అన్నారు. వల్లభ్​భాయ్‌ పటేల్‌ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు. రజాకార్ల, నిజాం నిరంకుశ పరిపాలనను అంతమొందించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్​భాయ్‌ పటేల్‌ అని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details