తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉత్సవాలు చేయడం కాదు.. గౌరవం కాపాడాలి : బండి సంజయ్ - bandi sanjay response on akbaruddin owaisi statement

పీవీ జయంతి ఉత్సవాలు జరపడం కాదు.. ఆయన గౌరవాన్ని కూడా కాపాడాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద నివాళులర్పించారు.

bjp telangana state president bandi sanjay response to akbaruddin owaisi's statements
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

By

Published : Nov 26, 2020, 10:41 AM IST

Updated : Nov 26, 2020, 11:04 AM IST

పీవీ సమాధి కూల్చేస్తామన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసమే కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.

ఉత్సవాలు చేయడం కాదు.. గౌరవం కాపాడాలి

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి వద్ద నివాళులర్పించిన బండి సంజయ్.. అయోధ్య విషయంలో పీవీ స్ఫూర్తిదాయక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా భాజపా చెప్పింది.. చేయాల్సిందే చేస్తోందని స్పష్టం చేశారు. పీవీ, ఎన్టీఆర్​పై గౌరవముంటే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. నందమూరి తారక రామారావు పేరు పెట్టుకున్న కేటీఆర్.. డ్రామారావు అయ్యారని ఎద్దేవా చేశారు.

Last Updated : Nov 26, 2020, 11:04 AM IST

ABOUT THE AUTHOR

...view details