Bandi sanjay on GO 317: 317 జీవోను సవరించాలంటూ ప్రగతిభవన్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన టీచర్లను అరెస్టు చేయడాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. అరెస్టు చేసిన టీచర్లందరినీ తక్షణమే బేషరతుగా విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ‘స్థానికత’కు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. సవరించేదాకా ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసే ఉద్యమానికి భాజపా అండగా ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. తాము చేస్తున్న పోరాటాలను ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
50 మంది అరెస్ట్..