తెలంగాణ

telangana

ETV Bharat / city

'కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి' - తెలంగాణలో కరోనా పరిస్థితి

కరోనాను ఎదుర్కోవడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. కరోనా చికిత్స కోసం పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్​ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చేలా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ.. గవర్నర్​కు లేఖ రాశారు.

bandi letter to governor
గవర్నర్​కు బండి సంజయ్​ లేఖ

By

Published : May 16, 2021, 4:52 PM IST

Updated : May 16, 2021, 5:42 PM IST

ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా చికిత్సను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు గవర్నర్‌కు ఈ మెయిల్​లో లేఖ పంపించారు.

కరోనాను ఎదుర్కోవడంలో తెరాస సర్కారు విఫలమైందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీలో కరోనా చికిత్సను చేర్చకపోవడం వల్ల పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు ఖాళీగా లేకపోవడం వల్ల గత్యంతరం లేక పేద, మధ్య తరగతి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్‌లో కరోనా చికిత్స ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపిన బండి సంజయ్​.. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా కరోనా చికిత్స చేయాలని డిమాండ్​ చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీలో భాగంగా చికిత్సలు చేయడం లేదన్నారు.

ఇవీచూడండి:ప్రభుత్వాల నిర్లక్ష్యమే కేసుల పెరుగుదలకు కారణం: ఉత్తమ్​

Last Updated : May 16, 2021, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details