తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణలో భాజపా విస్తరణ... ఇదే షా వ్యూహం...! - bjp plan to win telangana assembly elections

దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపొందిన తరువాత... భాజపా ఉత్సాహంతో ఉంది. అదే ఊపుతో గ్రేటర్​ హైదరాబాద్ ఎన్నికల్లో పనిచేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వ్యూహాలను క్షేత్రస్థాయిలో నేతలు పక్కాగా అమలు చేశారు. ఆ వ్యూహాలు పక్కాగా అమలు కావడం వల్లే బల్దియా ఎన్నికల్లో 50 స్థానాల్లో విజయం సాధించింది. చాలా చోట్ల రెండో స్థానంలో నిలిచింది.

bjp target to build government in telangana
bjp target to build government in telangana

By

Published : Dec 4, 2020, 10:14 PM IST

రాష్ట్రంలో పాగా వేయడానికి భాజపా వ్యూహాలకు పదును పెట్టింది. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 4 స్థానాల్లో అనూహ్యంగా గెలుపొందింది. ఆ తరువాత ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆశ్చర్యం కలిగే రీతిలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భాజపా జాతీయ, రాష్ట్ర నేతలు తమ వ్యూహాలను పక్కాగా అమలు చేశారు. ఇదే జోష్​తో గ్రేటర్ ఎన్నికలపై దృష్టిపెట్టారు. తమ వ్యూహాలను పక్కాగా అమలు చేసి... బల్దియాలో అనూహ్య రీతిలో దూసుకొచ్చారు. 149 చోట్ల పోటీచేసి 50 స్థానాల్లో విజయం సాధించి... అధికార తెరాసకు సవాల్​ విసిరారు.

పంచాయతీ టూ పార్లమెంట్...

ఉత్తరాదిలో తన ప్రాబల్యం పెంచుకున్న భాజపా... ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. దక్షిణాదిలో ఇప్పటికే కర్ణాటకను తన ఖాతాలో వేసుకుంది. తెలంగాణలో పాగా వేసే అవకాశం ఉందని పార్టీ అగ్రనేతలు గ్రహించారు. 2019 సాధారణ ఎన్నికలకు ముందే వ్యూహాలు రచించారు. ఆ తరువాత అవకాశం వచ్చిన ప్రతీసారి భాజపా తమ ప్రాబల్యం పెంచుకుంది. అదే స్థాయిలో సంఘ్ పరివార్​ను బలోపేతం చేసింది. 'పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు' ప్లాన్​ను అమలు చేసి... ఇప్పుడు బల్దియాలో 50 స్థానాలను కైవసం చేసుకుంది. గత గ్రేటర్​ ఎన్నికల్లో కేవలం 4 స్థానాలకే పరిమితమైన భాజపా... ఇప్పుడు 149 స్థానాల్లో బరిలోకి దిగి... 50 చోట్ల గెలుపొందింది.

భూపేంద్ర యాదవ్ నియామకం...

గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే... భాజపా తన ప్లాన్ అమలు చేసింది. ఇటీవల బిహార్ సాధారణ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించిన భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్​ను గ్రేటర్​ ఎన్నికల్లో ఇంఛార్జీగా నియమించింది. అప్పటినుంచి పోలింగ్ వరకు భాజపా తనదైన శైలిలో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. సుమారు 74 లక్షల మంది ఓటర్లున్న హైదరాబాద్​లో.. పోల్​ మేనేజ్​మెంట్ పక్కాగా అమలు చేసింది. అదే భాజపాను గ్రేటర్​లో ఈ స్థాయికి తీసుకొచ్చింది.

టార్గెట్-2023..!

దూకుడు ఎన్నికలకు పెట్టింది పేరు భూపేంద్ర యాదవ్. ఆయన హైదరాబాద్​పై ప్రత్యేక దృష్టిసారించారు. ఎప్పటికప్పుడు కార్యకర్తలతో మాట్లాడుతూ... అందరినీ సమన్వయం చేసుకుంటూ... బల్దియా ఎన్నికల్లో రాణించారు. మేయర్ పీఠం తీసుకురాలేకపోయినా... అధికార పార్టీతో నువ్వా-నేనా.. అనే స్థాయికి తీసుకొచ్చారు. భూపేంద్రయాదవ్​, రాష్ట్ర నేతలు, కార్యకర్తలు అవిశ్రాంతంగా చేసిన కృషి ఫలితమే 50 స్థానాల్లో గెలుపు. కేంద్రమంత్రి కిషన్​రెడ్డికి కూడా... పార్టీ తనకు అప్పగించిన పనిని పక్కాగా చేసి తనదైన ముద్రవేసుకున్నారు.

భాజపా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటోంది..?

గ్రేటర్ ఎన్నికల్లో భాజపా ప్రాబల్యం పెంచుకోవటంతో పాటు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు, ప్రజలకు సందేశం ఇవ్వాలని పనిచేసినట్టు స్పష్టంగా కనిపించింది. తాము పనిచేసేది కేవలం గ్రేటర్ ఎన్నికలకు కాదు.. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు అనేది చెప్పాలనుకుంది. అందుకే క్షేత్రస్థాయిలో తమ వ్యూహాలకు పదునుపెట్టింది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ.. ముఖ్యంగా తెలంగాణలో తమ బలం పెరిగిందని నిరూపించుకుంది. అమిత్​ షా.. తాను అనుకున్న ప్రతీ ప్రణాళికను పక్కాగా అమలు చేయడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానే అని నిరూపించిందని... రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు భాజపా కార్యకర్తల్లోనూ జోష్​ నింపింది.

ఇదీ చూడండి: గ్రేటర్‌ ఫలితాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ట్వీట్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details